calender_icon.png 20 March, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాళ్లను అధిగమించి.. అభివృద్ధి బాటలో..

20-03-2025 01:39:15 AM

దశాబ్దకాలంగా వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వం

బడ్జెట్ ప్రణాళికలు కేవలం కేటాయింపులు కాదు..

సామాజిక న్యాయానికి సూచికలు

  1. అన్ని వర్గాలకు వనరుల పంపకం జరగాలి
  2. అసమానతలు లేని వ్యవస్థ స్థాపనే లక్ష్యం
  3. సమాంతర పన్నుల పంపిణీ 
  4. సూత్రంలో సంస్కరణలు అవసరం
  5. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): గత దశాబ్ద కాలంగా రాష్ట్రం ఎదుర్కొన్న అనేక సవాళ్లను అధిగమించి తెలంగాణ అభివృద్ధి బాటలో కొనసాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి చేర్చే లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు తగినన్ని నిధులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నామన్నారు.

నేటి విధానాలే రేపటి తెలంగాణ నిర్మాణానికి ఉపకరిస్తాయని, లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత భేదం లేకుండా అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి వనరుల పంపకం జరగాలని, తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని భట్టి ప్రకటించారు.

రాష్ట్రానికి ఉన్నతమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత, స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికం, అభివృద్ధిపై కీలకోపన్యాసం చేశారు. ఉదయం 11.05 గంట లకు ప్రారంభమైన ప్రసంగం.. మధ్యాహ్నం 12.48 గంటలకు ముగిసింది.

ప్రతి పౌరునికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కల్పించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ల డమే తమ సర్కారు లక్ష్యమన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కావని, ఇవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి సూచికలు అని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మి ళిత విధానాలతో ప్రగతివైపు అడుగులు వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలయ్యే పటి ష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నారని, ఆయన సూచించిన విలువలనే పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రజలు నమ్మి, కట్టబెట్టిన అధికారాన్ని ఎవరికి తాక ట్టు పెట్టకుండా, అధికార పీఠా న్ని హోదాగా భావించకుండా, ప్రజల జీవన స్థితిగతులు పెం చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దశాబ్ద కాలంగా వ్యవ స్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణను గాడిలో పెడుతూ, తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనా లు, లక్ష్యాలను దృష్టిలో ఉం చుకొని, తమ ప్రభుత్వం ని రం తరం పనిచేస్తోందని భట్టి పేర్కొన్నారు.

‘నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉం డాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశా న్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తు న్నారు.

ఇలాంటి కువిమర్శలను సమర్థవంతంగా తిప్పి కొడు తూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. నిజం ప్రజలకు చెప్పకపోతే, స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. అందుకే, ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం అని భట్టి పేర్కొన్నారు. 

చైనా ప్లస్ వన్ వ్యూహం

రాష్ట్రంలోని పరిశ్రమలు 22.5 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. ‘చైనా ప్లస్ 1’ వ్యూహాన్ని అవలం బించడం ద్వారా తెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహ నాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పరిశ్రమల కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్రంలో సేవా రంగం కొత్తగా ఎక్కువమందికి ఉపాధిని కల్పిస్తోందన్నారు. ఇది మొత్తం శ్రామిక రంగంలో 34.8 శాతం వాటాను కలిగి ఉందన్నారు.

హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా, ముఖ్యం గా సాఫ్ట్‌వేర్ సేవలు, ఫిస్టిక్, లాజిస్టిక్స్, పర్యాటకం వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతోందని చెప్పారు. తెలంగాణలో శ్రామికశక్తి 68.7 శాతం ఉండగా, దేశీయ సగటు 64.3 శాతం మాత్రమే ఉందని భట్టి వెల్లడించారు. దీనిలో, మహిళల ఉపాధి శాతం 52.7 ఉండగా, ఇది దేశ సగటు 45.2 శాతం కంటే అధికమన్నారు.

మహిళలు, వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమైందో ఈ గణాంకాలే చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను సమర్పించిందని, ఇందులో కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని, అలాగే రుణ స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. 

పన్నుల పంపిణీలో వాటా తగ్గడంపై ఆందోళన

కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్‌లు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుందన్న విషయాన్ని కమిషన్‌కు వివరించామని, ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలను ఆర్థిక సంఘానికి పంపామని భట్టి వివరించారు. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై భటి ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే, 15వ ఆర్థిక సంఘం కాలంలో ఇది 2.102 శాతానికి తగ్గిందని భట్టి చెప్పారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించేలా పన్నుల పంపిణీ విధానాన్ని మరింత హేతుబద్ధంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోందని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సమాంతర పన్నుల పంపిణీ సూత్రంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించిందని.. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘తలసరి ఆదాయ దూరం’ అనే ప్రాతిపదిక ప్రాధాన్యతను తగ్గించాలని, 50 శాతం వెయిటేజిని ఇవ్వాలని తమ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందన్నారు. న్యాయమైన వాటాను సాధించడంతో పాటు, ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి వివరించారు.

గ్లోబల్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ 

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనాతో పాటు నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ర్ట దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్ 2050’ అనే ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ -డాలర్ల వ్యవస్థగా రూపాంతరం చెందేదిశగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. హైదరాబాద్ మహానగరంలో రవాణా, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నామన్నామని చెప్పారు.

దీనిలో భాగంగా హైదరాబాద్‌ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీనదీ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభించామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధితో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యమందించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీస్థాయిలో ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే తమ సర్కారు ఎప్పటికప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్తుందన్నారు.