calender_icon.png 2 November, 2024 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 సంస్థలపై అగ్రరాజ్యం కన్నెర్ర

02-11-2024 12:21:53 AM

  1. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతు తెలిపిన దేశాలపై అమెరికా నజర్
  2. భారత్, చైనా సహా 12 దేశాల్లోని సంస్థలపై వేటు

వాషింగ్టన్, నవంబర్ 1: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా అధునాతన సంకేతిక పరిజ్ఞానాన్ని అందించారనే ఆరోపణల నేపథ్యంలో భారత్, చైనా సహా డజనుకు పైగా దేశాలకు చెందిన దాదాపు 400 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది.

యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి మాస్కోకు సహకరిస్తే భవిష్యత్ లో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలు విధించిన వాటిలో చైనా, హాంకాంగ్‌తో పాటు భారత్‌కు చెందిన నాలుగు సంస్థలు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

అమెరికా ట్రెజరీ అండ్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. డజనుకు పైగా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు, 400కు పైగా కంపెనీలపై ఆంక్షలు విధించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి మాస్కోకు సహకరిస్తే మరింత కఠిన చర్యలకు వెనుకాడమని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి చివరి వారంలో రష్యా దండయాత్రను ప్రారంభించిన కొద్ది రోజులకే ఆంక్షలు విధించడం ప్రారంభించిన అగ్రరాజ్యం ఎలాగైనా యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.