calender_icon.png 20 November, 2024 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా నుంచి భారత్‌కు 1,400కు పైగా కళాకృతులు

20-11-2024 12:17:52 AM

న్యూయార్క్, నవంబర్ 19: భారత్ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400 కళాకృతులను అమెరికా తాజాగా భారత్‌కు అప్పగించింది. వివిధ కేసుల్లో పట్టుబడిన కళాకృతులను మాతృదేశాలకు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈ పని పూర్తి చేసినట్లు మాన్‌హాటన్ యాంటిక్విటీ స్మగ్లింగ్ విభాగం ప్రకటించింది. ఇండియాకు చేరుకున్న శిల్పాల్లో  దేవ నర్తకి శిల్పం అపురూపమైనది.

దీనితో పాటు ఇంకా ఎన్నో సుందరమైన కళాకృతులు భారత్‌కు చేరుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మాన్‌హాటన్ యాంటిక్విటీ విభాగం ఇప్పటివరకు స్మగ్లర్ల నుంచి వివిధ దేశాలకు చెందిన 5,800కి పైగా కళాకృతులను స్వాధీనం చేసుకున్నది.