calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లో పారమిత విద్యార్థుల ప్రతిభ

12-04-2025 05:39:34 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫౌండేషన్ (ఐ.ఓ.ఎఫ్) ఢిల్లీ వారు వివిధ సబ్జెక్టులకు నిర్వహించిన ఒలింపియాడ్ పోటీలలో స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ ర్యాంకులను సాధించారు. పాఠశాలకు చెందిన శక్తికిరణ్ శెట్టి  జనరల్ నాలెడ్జ్ లో అంతర్జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు, అర్హాన్ లతీఫ్ గణితంలో 3వ ర్యాంకు సాధించి ఆలిండియా సౌత్ జోన్ టాపర్లుగా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ తెలిపారు.

వీరితో పాటు 33 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో మెరిట్ సర్టిఫికేట్స్ సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేష్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, టి.యస్.వి.రమణ, హన్మంత రావు, ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ, సమన్వయకర్తలు నాగరాజు, రాము, గైడ్ టీచర్స్ గర్శకుర్తి ప్రదీప్, సంధ్యా రాణి ఉపాధ్యాయులు అభినందించారు.