బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది, కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఏజెన్సీ కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకపోవడం, పిఎఫ్, ఈఎస్ఐ లో కోత విధించడంతో నాలుగు రోజులుగా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమాలు ఇందులో భాగంగా బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే జనవరి 20న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.