calender_icon.png 13 January, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరసన

12-01-2025 06:51:20 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ ఇవ్వాలిసిన యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి నెల చెల్లించాల్సిన  వేతనాలు, పీఫ్, ఈఎస్.ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6 నెలలు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది పట్ల కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు, పీఫ్ ఈఎస్.ఐ చెల్లించాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రమేష్ మల్లీశ్వరి జానకి, చంద్రకళ, విజయ, తిరుమల, మంగ, శ్రీకాంత్, షేక్ ఇబ్రహీం, అన్వర్, మాధవి, పద్మ, దేవేంద్ర మెహరిన్, శేఖర్, చంద్రమౌళి సందీప్, దీప తదితరులు పాల్గొన్నారు.