హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సిం గ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 900 మంది పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్య దర్శులుగా గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం పీసీసీ అధికార ప్రతినిది కోటూరి మానవతరాయ్ విజ్ఞప్తి చేశారు. పలువురు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులతో కలిసి హైదరాబాద్‌లో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు.