08-02-2025 01:18:34 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): బీసీ కమిషన్ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గొల్ల శ్రీనివాస్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కా తనకు అనుకూలంగా పనిజేయాలని ఓ వ్యక్తి కోరినందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గొల్ల శ్రీనివాస్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. శుక్రవారం రూ.లక్ష ఇస్తుండగా ఏసీ అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు రిమాండ్ తరలించారు.