calender_icon.png 31 January, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలివ్వాలి

26-08-2024 04:30:01 AM

ఎంపీ ఈటల రాజేందర్

ముషీరాబాద్, ఆగస్టు 25: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం నేరుగా పే స్కేల్ ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శాంతియుత ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ హాజరై మాట్లాడారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. అనంతరం పద్మ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లం గోవర్ధన్, కొటాల సంతోష్‌కుమార్, వినోద్, విజయలక్ష్మి, జే సంధ్య, శ్రీధర్, కృష్ణ, నజీర్, జగదీష్, అరుణ్‌కుమార్, ప్రసాద్, నారాయణ, యదయ్య, సురేందర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.