ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీలతో కాకుండా, నేరుగా ఆయా శాఖల ద్వారా నేరుగా జీతాలివ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లా డారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలకే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో సేఫ్‌గార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. హెల్త్ కార్డులివ్వాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం గోవర్ధన్, సలహాదారు దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.