calender_icon.png 19 April, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్ విధుల్లో బయటి వ్యక్తులు!

06-04-2025 12:38:01 AM

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మక నిమ్స్‌లో ఎటువంటి సంబంధం లేని బయటి వ్యక్తులు సిబ్బందిగా చలామణి అవుతున్నట్టు సమాచారం. డెంటల్ విభాగంలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్ట ర్ ఖాజామొహినుద్దీన్ తనకు అసిస్టెంట్‌గా శౌర్య అనే బ యటి వ్యక్తిని నియమించుకున్నారంటూ నిమ్స్ అధికారి ఒకరు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. బయటి వ్యక్తులు అనధికారికంగా నిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టుగా ఖాజామొహినుద్దీన్ అంగీకరించినట్టు సదరు అధి కారి  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన కాపీ ‘విజయక్రాంతి’ చేతికి వచ్చింది. ఫిర్యాదుపై నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్పను ‘విజయక్రాంతి’ వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు. ఇటువంటి ఘటన నిమ్స్‌లో చోటు చేసుకోలేదని పేర్కొన్నారు.