calender_icon.png 21 February, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండోమెంట్ అధికారుల తీరుపై ఆగ్రహం

18-02-2025 12:03:55 AM

కొన్ని నిర్మాణాలనే కూల్చివేయడం పై మండిపాటు  

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఎండోమెంట్ అధికారుల తీరుపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దేవాదాయ శాఖకి చెందిన భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల్లో కొన్నిటిని మాత్రమే కూల్చివేయడం పై స్థానికులు మండిపడుతున్నారు.

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లోని పలు దేవాలయాలకి భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను ఎండోమెంట్ అధికారులు అడ్డుకుంటున్నారు. దేవాల య భూములను పరిరక్షణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికి కొన్ని అక్రమ నిర్మాణాలు అలాగే కొనసాగడంపై స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పు డు అడ్డుకోవడం లేదని మండిపడుతున్నారు. అత్తాపూర్ లోని వివిధ ప్రాంతాల్లో సీతారామ చంద్ర స్వామి దేవాలయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం అదేవిధంగా భవాని మాత దేవాలయాలకు చెందిన వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆలయం భూముల్లో అక్రమ నిర్మాణాలు అలాగే కొనసాగుతుందటం గమనార్హం. దేవాదాయ శాఖ ఇప్పటికైన స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.