calender_icon.png 18 April, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ఆర్డర్ పట్టించుకోని జెన్కో?

10-04-2025 01:29:48 AM

బూడిద అనుమతి ముగిసినా ఆగని తరలింపు 

ప్రభావిత గిరిజన యువతకి అన్యాయం

జెన్కో అధికారులపై ఫిర్యాదుల వెల్లువ

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 9 ( విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5 6 దశల బూడిద చెరు వులోని బూడిద తరలింపులో తీవ్ర అక్రమా లు చోటు చేసుకుంటున్నాయి. రోజుకు రూ లక్షల వ్యాపారం నేపథ్యంలో రాజకీయ ప్రమేయం చోటు చేసుకోవడంతో కోర్టు ఆర్డర్లను సైతం జెన్కో అధికారులు విస్మరించి రాజకీయ పలుకుబడికి తలగ్గి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకాలం సాఫీగా సాగిన ప్రభావిత గ్రా మాల గిరిజన యువత బూడిద తరలింపు ఈ ఏడాది రాజకీయ రంగ ప్రవేశంతో అగ మ్య గోచరంగా మారింది. ప్రభావిత గ్రా మాల యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు కోర్ట్ ను ఆశ్రయించారు.

దీంతో గౌరవ హై కోర్టు wp 11 261/2023 ప్రకారం ప్రభావిత గ్రామాల యువతకు అవకాశం కల్పి స్తూ, పిటీషనర్లైన ముగ్గురిని పరిగణలోకి తీసుకోవాలని తీర్పు జారీ చేశారు. మరో తీర్పులో డబ్ల్యూ పి 32042/2024 లో  13 మంది గిరిజన సంఘాల నాయకులకు బూడిద తరలించుకొనేలా తీర్పును ఇచ్చా రు.  గౌరవ కోర్టు ఆర్డర్లు ఈ రీతిలో ఉంటే జెన్కో అధికారులు మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ పలుకుబడికి తలవగ్గి కేవలం పిటీషనర్లైన బట్టు లక్ష్మణ్, బట్టు కిషోర్,గుగులోత్ రాంబాబులకు బూడిదను తరలించే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభావిత గ్రామాల గిరిజన యువత రోడ్డున పడ్డారు. కోర్టు ఆర్డర్ ను అతిక్రమించి జనుకో అధికారుల వ్యవహారంపై అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి. ప్రజా ప్రభుత్వం గా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై సర్వత్రా విమర్శలు వెలబడుతున్నాయి. 

పుణ్యకాలం పూర్తయిన కొనసాగుతున్న తోలకాలు 

గౌరవ హైకోర్టు ఆదేశాలను ఆతిక్రమించడమే కాకుండా, జన్కో అధికారులు ఒక అడుగు ముందుకు వేసి మరో అక్రమానికి తెరలేపారని ఆరోపణలు వస్తున్నాయి. పిటీషనర్లైన ముగ్గురికి బూడిద తరలింపుకు ఇచ్చిన అనుమతులు ఈ ఏడాది మార్చి 31 తో ముగిసింది. మళ్లీ జనకో అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేసే వరకు బూడిద చెరువులో బూడిదను తరలించ రాదు. వడ్డించే వాడు మనవాడు అన్నట్లుగా అనుమతి లేకున్నా గత పది రోజులుగా ఏదేచ్ఛగా ఆ ముగ్గురు బూడిదను అక్రమంగా తరలిస్తున్న జన్కో అధికారులు కల్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తిలా పాపం తలా పిరికేడు అన్నట్లు అక్రమాల్లో రాజకీయ నాయకులతోపాటు జె న్కో అధికారు లకు కూడా వాటా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జన్కో సీఎం డి, విద్యుత్ శాఖ మంత్రి పాల్వంచ బూడిద తరలింపు అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన సం ఘాల నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటికే బూడిద తరలింపు అక్రమాలపై జన్కో ఉన్నతాధికారులపై డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడి), మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), జాతీయ ఎస్టీ కమిషన్‌కు కొంతమంది గిరిజన కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు.