calender_icon.png 19 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్లువెత్తిన నిరసనలు

14-02-2025 12:56:42 AM

 శ్రీ చైతన్య స్కూల్ వద్ద బీజేపీ, ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా డీఈవో, ఎంఈఓ కనబడడం లేదని ఫిర్యాదు 

మేడ్చల్, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి) : మేడ్చల్ లోని శ్రీ చైతన్య యాజమాన్యం వైఖరిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఫీజు చెల్లించాలని విద్యార్థిని అఖిల ను వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో బిజెపి, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వేరువేరుగా గురువారం పాఠశాల ముందు ధర్నాచేశారు. పాఠశాలకు సెలవు ప్రకటించి తాళం వేయడంతో ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు.

అక్కడ ఉన్న పూల కుండీలను, ప్లాస్టిక్ కుర్చీలను ధ్వంసం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని నినాదాలు చేశారు. బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, యువ మోర్చా అధ్యక్షుడు కానుగంటి విజయ్, పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, డివి కిషన్ రావు, కొండ ఆంజనేయులు ముదిరాజ్, ఎల్ వి శ్రీకాంత్, రాథోడ్, రాగం అర్జున్, చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, కృష్ణప్రియ, బుచ్చిరెడ్డి, రాఘవరెడ్డి, సాకార బోయిన సాయికుమార్, అవినాష్, గోలి కర్ మహేష్, జాకాట బాబురావు పాల్గొన్నారు.

డీఈవో, ఎంఈఓ కనిపించడం లేదని ఫిర్యాదు 

విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పటికీ డిఇఓ, ఎంఈఓ పాఠశాలకు వచ్చి విచారణ చేయకపోవడం పట్ల ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎంఈఓ, డిఇఓ కనిపించడం లేదని అక్కడే ఉన్న ఎస్త్స్ర అశోక్ కు ఫిర్యాదు అందజేశారు. ఎంఈఓ కుర్చీకి తెల్ల కాగితం అందించి నిరసన తెలిపారు.