calender_icon.png 1 March, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన ప్రయాణికుల కోసం ఎయిర్పోర్ట్ లో ఔట్ పోస్ట్

01-03-2025 08:44:20 PM

ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి...  

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఔట్ పోస్టు ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. శనివారం ఆయన అవుట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిర్ పోర్ట్  సిఈఓ ప్రదీప్ ఫనికర్, సిఐఎస్ఎఫ్డీజి మొహంక్య తదితరులు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔట్ పోస్ట్ ప్రారంభించారు. సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలోని ప్రయాణికుల కోసం నూతనంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 

శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ టౌన్ లో ఉండడంతో ఎయిర్పోర్ట్ ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి ఇబ్బందిగా మారిందని చెప్పారు. జిఎంఆర్ సహకారంతో నూతన అవుట్ పోస్ట్ ప్రారంభించినట్లు తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జనాభా పెరిగిందని, వారికోసం శంషాబాద్ గ్రామంలో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేవలం ఏర్పోర్ట్ ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సౌకర్యాన్ని ఏర్పాటు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు, సిఐఎఫ్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.