రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
సూర్యాపేట, జనవరి 26 : రాష్ర్టంలో ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన కొనసాగుతోందని రాష్ర్ట వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాలోని సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ఆదివారం జరిగిన ప్రజాపాలన పథకాల ప్రారం భోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఒక్కొక్కటిగ అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతు న్నామన్నారు. రాష్ర్ట ఆర్ధిక పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పథకాలను కోనసాగిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పక ప్రజాపాలన పధకాలు అందజేస్తామన్నారు. కావున ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రేషన్ కార్డులకు సమానంగా హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. అనర్హులు ఎవరైనా లబ్ది పొందితే స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలనీ కోరారు. అధికారులు అరుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాల ని సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అరులకి అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించా లన్నారు.
తదుపరి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీల ను తప్పక నెరవేర్చాలన్నారు. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు నాగార్జునసాగర్ పరిధిలోని రైతులు నీటి విడుదలపై స్పష్టత లేక గందరగోళంలో ఉన్నారని కాబట్టి ప్రభుత్వం వారికి స్పష్టతనివ్వాలన్నారు.
తుంగతుర్తి, సూర్యా పేటలతో పాటు కోదాడ నియోజక వర్గం లోని కొంత ప్రాంతం రైతులకు కాలేశ్వరం నీటిని అందించి గంటలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రాష్ర్ట పర్యా టక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఈవో శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో వేణుగోపాల్, తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి పాల్గొన్నారు.