calender_icon.png 5 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాది అధికారిక సర్వేనే

05-02-2025 01:32:57 AM

  1. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61శాతం
  2. ఇప్పుడు సర్వే చేసిన ఆఫీసర్లే.. అప్పుడు చేశారు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాం తి): తమ ప్రభుత్వ హయాంలో చేసిన సర్వే అధికారింగానే చేసినట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. అందులో పొందుపర్చింది అఫిషియల్ డాటానేనని పేర్కొన్నారు. 2014లో బీఆర్‌ఎస్ చేసిన సర్వేకు శాస్త్రీయత లేదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు చేసిన విమర్శలపై కేటీఆర్ సమాధా నం చెప్పారు.

అప్పుడూ.. ఇప్పుడూ సర్వే చేసింది అధికారులేనన్నారు. అధికారిక డాటా కావడం వల్లే ప్రభుత్వ వెబ్‌సైట్లో పెట్టినట్టు వెల్లడించారు. తమ హయాంలో సర్వేలో భాగంగా  ఒక్క రోజులోనే 1.03 కోట్ల కుటుంబాలు, 3.63 కోట్ల మంది వివరాలు సేకరించిందని గుర్తుచేశారు. ఆ వివరా ల ప్రకారం బీసీల జనాభా 61 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

నాడు బీసీలు 1.85 కోట్ల మంది (51శాతం)తోపాటు ముస్లిం బీసీలు 10శాతాన్ని కలుపుకుంటే మొత్తం 61శాతం అవుతుందని వివరించారు. అప్పు డు 51శాతం ఉన్న బీసీలు.. ఇప్పుడు 46శాతానికి ఎలా తగ్గారని ప్రశ్నించారు. ప్రభుత్వ నివేదిక తప్పుల తడక అని సొంతపార్టీ ఎమ్మెల్యీలే విమర్శిస్తున్నారన్నారు. 

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సీఎం ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని తామంతా భావించినట్టు చెప్పారు. ఈ సభలో బీసీలకు న్యాయం చేసేందుకు బీసీ సబ్ ప్లాన్‌ను ప్రకటిస్తారని అనుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.