17-03-2025 01:55:45 AM
మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి..
కోదాడ మార్చి 16; కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల, విశ్రాంతి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ సమావేశంలో ఎంపీ రఘువీరారెడ్డి తో కలిసి మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 55 వేల పోస్టులు భర్తీ చేశామని 11 టీచర్ పోస్టులు నింపామన్నారు. ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడారు. డా. సుధాకర్ మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ అందరి సహకారంతో రాష్ట్రస్థాయిలో మూడు రోజులపాటు కోదాడలో క్రీడా సాంస్కృతిక సాహిత్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. వంగవీటి రామారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, బషీర్ దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్, సుదర్శన్ రెడ్డి బొల్లు రాంబాబు, పట్టాభి రెడ్డి పాల్గొన్నారు.