calender_icon.png 6 October, 2024 | 11:56 AM

మాది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం

06-10-2024 02:17:09 AM

ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 5(విజయక్రాంతి): తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే క్రియాశీలకంగా పనిచేయగలుగుతారని, ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు ప్రజ లకు చేరుతాయన్నారు.

సీతక్క ఆధ్వర్యంలో శనివారం సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్(ఎస్‌ఆర్‌డీఎస్) బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. బోర్డు మీటింగ్ పదేళ్లుగా నిర్వహించ కపోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

ఎస్‌ఆర్‌డీఎస్‌లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 3,700 మందికిపైగా ఉద్యోగులున్నారని, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేట్లు, ఇంజినీరింగ్ కన్సల్లెంట్ వంటి ఉద్యోగులందరికీ భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెష ల్ కమిషనర్ షఫియుల్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.