calender_icon.png 27 November, 2024 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాది రెడ్ సిగ్నల్.. మీది రెడ్ కార్పెట్

27-11-2024 01:16:52 AM

  1. అదానీ అవినీతిపరుడని రాహుల్ ప్రచారం  
  2. రెడ్ కార్పెట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం  
  3. అదానీ, అన్న, అల్లుడు, బామ్మర్ది కోసమే పాలన  
  4. 12,400 కోట్ల దావోస్ ఒప్పందాలు రద్దు చేయాలి 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): అదానీ అవినీతిపరుడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రపంచమంతా తిరిగి చెప్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

తాము అదా నీకి రెడ్ సిగ్నల్ వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. అదానీ, అన్నలు, అల్లు డు, బావమరిది జేబులు నింపే పనిలో ము నిగిపోయారని ధ్వజమెత్తారు. రాహుల్ చెప్పినందుకు ఆగమేఘాల మీద రూ.100 కోట్ల విరాళం రద్దు చేయడం వరకు బాగానే ఉం ది.. కానీ, దావోస్‌లో చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాలను రద్దు చేయాల ని డిమాండ్ చేశారు.

తాను అదానీని కలిసిన మాట వాస్తవమేనని, ఆయనతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టంచేశారు. బీజేపీతో చీకటి ఒప్పందం, రాహుల్ గాంధీ ని కలిసి ఆయనకు మూటలు ఇచ్చి కుర్చీ కాపాడుకోవటానికే సీఎం హస్తినకు వెళ్తున్నారని విరుచుకుపడ్డారు. మైక్రోసాప్ట్ నుంచి రెండుదశల్లో ఒకసారి రూ.15 వేల కోట్లు, రెండోసారి రూ.16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తుచేశారు.

ఈ సీఎం మాత్రం మైక్రోసాప్ట్ డాటా సెంటర్ పెట్టుబడిని అదా నీ డాటా సెంటర్‌గా తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఆయనకు సబ్జెక్ట్ తెలియక ఏదిపడితే అది మాట్లాడితే రాష్ర్ట గౌరవం మంట కలుస్తుందని అన్నారు. గతంలో కూడా విప్రో చైైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలయ్యాడని, మైక్రోసాఫ్ట్ వచ్చాక అమెజాన్ వచ్చిందన్నారు.

అమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని, తా ము మొత్తం రూ.67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సర్కారే తల్లీదండ్రి అయి చూసుకుంటుందని పిల్లలను తల్లిదండ్రులు గురుకులాలకు పం పిస్తే.. 48 మంది పేద పిల్లలను సీఎం రేవం త్ పొట్టన బెట్టుకున్నారని  ఆరోపించారు. వి ద్యార్థులవి మరణాలు కావని.. ప్రభుత్వం చేయించిన హత్యలుగానే భావిస్తున్నామని ధ్వజమెత్తారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌లో గురుకుల పాఠశాలలో చనిపోయి న విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించేందు కు వెళ్తే.. ఆ తల్లితండ్రులు తమ లాంటి కడుపు కోత వేరేవారికి రాకుండా పోరాడాలని తనను కోరినట్టు చెప్పారు. అప్పటినుంచి తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తూ గురుకులాల విద్యార్థుల అంశాన్ని గుర్తుచేస్తున్నా మని, రేవంత్ పట్టించుకోవటం లేదని మం డిపడ్డారు.

ఆ కుటుంబాల తరఫున అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా మని హెచ్చరించారు. పిల్లలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని నిబ్బరంగా ఉండాలని, ఆరోగ్యం బాగాలేకపోతే తమ పార్టీ తరఫున ప్రైైవేట్ ఆసుపత్రిలో చేరుస్తామని హామీ ఇచ్చారు.  

సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ప్రాణాలు తీశావు 

కొండారెడ్డిపల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు రేవంత్ కారణమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. శైలజ అనే విద్యార్థి చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు తమ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వెళ్తుంటే హౌస్ అరెస్ట్ చేశారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. అనిల్‌జాదవ్, జాన్స న్ నాయక్ లాంటి నేతలను కూడా అరెస్ట్ చేశారని, వాళ్లు వెళ్తే ఏమవుతుందని ప్రశ్నించారు.

అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలు.. ఇదే ప్రజాపాలనా? ఏడాది పాలనలో అదానీ, అ ల్లుడు, అన్న, బావమరిది సృజన్‌రెడ్డికి అమృ తం పంచటం కోసం తప్ప.. ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదని విమర్శించారు. అదానీ చెక్ ఇచ్చి 38 రోజులు అయినా ఇప్పటివరకు ఎందుకు క్యాష్ చేయలేదని, అంటే చెక్ చూపించి వెనక నుంచి ఆ డబ్బులు దోచుకు నే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

అదానీ అవినీతిపరుడని రేవంత్‌కు ఇప్పుడే తెలిసిం దా? మహారాష్ర్ట ఎన్నికల ప్రచారం లో అదానీని గజదొంగ అన్నారని, ఇక్కడ నీతిమంతు డుగా కనిపించాడా అంటూ నిలదీశారు. అదానీ వ్యవహారంపై రెండేళ్ల కిందటే హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిందని గుర్తు చేశారు. 

రాహుల్ మొట్టికాయలతో వెనక్కి  

రాహుల్‌గాంధీ మొట్టికాయలు వేసి న తర్వాత వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధ, ఆవేశంలో రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని   కేటీఆర్ విమర్శించారు. ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, కావాల్సినంత దోపీడి చేస్తున్నారని, ఇంకా ఎందుకు బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు.

ఢిల్లీ వెళ్లే ముందు ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడి చిప్ చెడిపోయినట్టు ఉందని ఎద్దేవాచేశారు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇంతతప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ మాట లు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

బీఆర్‌ఎస్ నేతలు రక్షణ శాఖ కు ఇచ్చిన ప్రాజెక్టులు ఇచ్చామంటారని, రక్షణ శాఖ మా చేతిలో ఉండదనే సంగ తి సీఎంకు తెలియదా? మరీ రాజ్‌నాథ్‌సింగ్ ఏం చేస్తున్నారో చెప్పాలని అన్నా రు. విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇస్తుందని, ఇంత తెలివి తక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలని అన్నా రు. ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్ధాలను మీడియా మిత్రులు ప్రశ్నిం చాలని కోరారు.

అనుముల రేవంత్ కాదు అబద్దాల రేవంత్ 

ముఖ్యమంత్రి ఇంటి పేరు అనుము ల కాదని, అబద్దాల రేవంత్ అని మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్‌లను బీఆర్‌ఎస్ ఇచ్చినట్టు చెప్తుంటే ఆయనకు ఏమాత్రం పరిజ్ఞానం లేదని అర్థమవుతుందన్నా రు. కేసీఆర్ ఏం తప్పు చేశాడని విమర్శ లు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు పాలసీ విషయంలో దేశంలో కేంద్రాన్ని నిలదీసిన ఒకే ఒక్కడు కేసీఆర్..

నీ లాగా కాళ్లు పట్టుకోవటం, లుచ్చా పనులు చేయ టం, మస్కా కొట్టటం, గౌతమ్ భాయ్ అంటూ చుట్టూ తిరిగే రకం తాము కాద ని స్పష్టంచేశారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్ వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా తప్పకున్నాడని మండిపడ్డారు.