calender_icon.png 30 January, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటకెక్కిన మన ఊరు-మనబడి

29-01-2025 12:22:56 AM

  1. నిధులు లేక ఆగిన పనులు
  2. పూర్తయిన పనుల్లో నాణ్యతా లోపం
  3. నిర్మల్ జిల్లాలో రూ.30 కోట్ల బకాయిలు 
  4. పేద విద్యార్థులకు తప్పని తిప్పలు

నిర్మల్, జనవరి 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రారంభించిన మన ఊరి-మన బడి పనులు అటకెక్కాయి. నిర్మల్ జిల్లాలో మొత్తం 735 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి విడత కింద 260 పాఠశాలల్లో మన ఊరు బడి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టింది.

ప్రహరీలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ వైరింగ్, తాగు నీటీ సౌకర్యం, ఫర్నీచర్ ఏర్పాటు, వివిధ మరమ్మతులు వంటి మొత్తం 16 రకాల పనులు చేపట్టారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం విద్య కమిటీలు, పాఠశాల యాజమాన్య కమిటీలు, మహిళా సంఘాల సభ్యుల తీర్మానంతో ప్రధానోపాధ్యాయులే కన్వీనర్లుగా పాఠశాల కమిటీ సభ్యులు పనులు చేపట్టారు.

రూ.30 లక్షల లోపు ఉన్న పనులను విద్యా కమిటీలకు అప్పగించగా, రూ.30 లక్షలపైన ఉన్న పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే చాలా గ్రామాల్లో గుత్తేదారులు ముందుకురాకపోవడంతో ఈ పనులు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే చేపట్టారు.

260 పాఠశాలల్లో పనులు ప్రారంభంకాగా 142 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. ఇంకా 118  పాఠశాలల్లో పనులు పూర్తి కాలేదు. కొన్ని పాఠశాల్లో 50 శాతం పనులు పూర్తి కాగా మరి కొన్ని పాఠశాల్లో 30 శాతం పనులు కూడీ పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బం  పడుతున్నారు.

నాసిరకంగా పనులు

మన ఊరు మన బడి పనులు నాసిరకంగా నిర్వహించినట్టు ఆరోపణలొ   ఎన్నికలకు ముందు ప్రభుత్వం హడావుడిగా పనులు మంజూరు చేసి చేపట్టడమే ఇందుకు కారణమని ప్రజలు వాపోతున్నారు. పనులు నాణ్యతగా జరిగేలా ఇంజనీ   సిబ్బంది పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా ఒక్కో అధికారికి మూడు నుంచి నాలుగు మండలాలు ఇన్‌చార్జుగా ఇవ్వడం, గ్రామా  పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు పను  చేపట్టడంతో నాణ్యత లోపించినట్టుగా తెలుస్తున్నది.

నిధుల కొరత కూడా ఇందుకు ఒక కారణంగా మారినట్టు తెలుస్తున్నది. నాసిరకంగా పనులు చేపట్టడంతో ప్రస్తుతం నల్లాలు ఊడిపోవడం, విద్యుత్ వైర్లు వేలాడటం, వేసిన రంగులు వెలిసిపోవడం, మర  పనుల్లో నాసిరకం ఇసుక వాడటం వల్ల గోడలు పగుల్లు తేలుతున్నాయి. బిగించిన తలుపులు ఊడిపోతున్నా  వాటర్ ఫిల్లర్లు పని చేయడం లేదు.

కుం  మం  ఓలా, సోన్ మండల కేంద్రం, భైంసా పట్టణంలోని పిప్రి కాలనీ, ముథోల్ కుబీర్ సారంగపూర్, మామాడ, లక్ష్మణ చాంద, కడెం దస్తురాబాదు మండలాల్లోని వివిధ పాఠశాలల్లో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌లను అడిగితే బిల్లులు రావడంలేదని చెపుతున్నారు.

పెండింగ్‌లో రూ.30 కోట్ల నిధులు

నిర్మల్ జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.30 కోట్ల నిధులు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. 2023లో అప్పటి ప్రభుత్వం మన ఊరు మన బడి పనులు ప్రారంభించింది. ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు టెండర్లు నామినేటేడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు కేటాయించారు.

పనుల చేపట్టిన తర్వాత మూడు విడతల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టరుల అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. కొందరు అప్పు తెచ్చి పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పెండింగ్ బిల్లుల కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారడం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సమస్య మరింత జఠిలం అయ్యింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను కలిసి మొరపెట్టుకున్నా నిధులు విడుదల కాలేదు