calender_icon.png 4 January, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా థియేటర్‌కు అన్ని అనుమతులున్నాయి

30-12-2024 02:34:29 AM

  1. షోకాజ్ నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లు
  2. పోలీసులకు ఆరుపేజీల లేఖ రాసిన యాజమాన్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీచేసిన షోకాజ్ నోటీసులకు రిప్లు ఇచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం థియేటర్ యాజమాన్యం 6పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా చిక్కడపల్లి పోలీసులకు పంపించింది. తమ థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని యాజమాన్యం స్పష్టం చేసింది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని, గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని లేఖలో పేర్కొంది.

పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నట్లు తెలిపారు. ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4, 5 తేదీల్లో థియేటర్‌ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందన్నారు.

గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్‌లో సినిమాలు వీక్షించేందుకు వచ్చారన్నారు. అలాగే సంధ్య థియేటర్‌లో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్‌కి ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా ఉందని పేర్కొన్నారు.  

డిసెంబర్ 17న షోకాజ్ నోటీసులు..

ఈనెల 4న రాత్రి పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన జరిగిన ఘటనపై థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ డిసెంబర్ 17న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ షోకాజ్ నోటీస్‌లకు తాజాగా థియేటర్ యాజమాన్యం పై విధంగా రిప్లు ఇచ్చింది.