పండుగ పూట అమ్మ చేసే స్వీట్.. ఆలయాల్లో పూజారి ఇచ్చే ప్రసాదం.. సీజనల్ పచ్చళ్లు.. ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయి. మరి ఇష్టమైన పదార్థాలు తినాలనిపిస్తే.. వెంటనే ఏం చేస్తాం.. గూగుల్‌లో సెర్చ్ చేసేస్తాం.. ఇప్పుడంతా గూగుల్ ట్రెండ్ నడుస్తున్నది. ఏది ఏలా చేయాలన్నా.. ఇష్టమైనది మరింత రుచిగా చేసుకోవాలన్నా.. వెంటనే ఆ రెసిపీని గూగుల్‌లో వెతికేస్తాం. ఈ ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన భారతీయ వంటకాలను ‘ఇయర్ ఇన్ సర్చ్ 2024’ నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్‌లో నిలిచిన భారతీయ వంటకాలేంటో తెలుసుకుందాం...
మామిడికాయ పచ్చడి..
మామిడికాయ పచ్చడి.. పెద్దలు, పిల్లలు ఇష్టంగా తినే పచ్చడి. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి, కాసింత నెయ్యి కలుపుకుని తింటే కడుపు నిండిపోవడం ఖాయం. మామిడికాయ ఊరగా యను సహజంగా ‘ఆమ్ కా ఆచార్’ అని పిలుస్తారు. దీన్ని పరాఠాలు, స్నాక్స్, అన్నం పక్కన పెట్టుకుని తింటారు. ఈ పచ్చడిలోకి ఉపయోగించే ఆవాలు, మెంతి గింజలు, మిరపకాయలు, ఉప్పు పచ్చడికి మరింత రుచిని అందిస్తాయి.
పుల్లటి రుచితో పచ్చడి నోరూరిస్తుంది. ఈ ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్‌లో మామిడికాయ పచ్చ డిని వెతికారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ పచ్చడి ప్రియులు చాలామంది ఉన్నారని. మామిడికాయ పచ్చడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడి శరీరానికి పోషకాలను అం దిస్తుంది. ఈ పచ్చడి ఇమ్యూనిటీని పెంచుతుంది. మామిడికాయలో విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉంటాయి.
దేశంలోని నగరాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో స్థానిక ఆహా ర పదార్థాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వీధి చివరిలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ హోటళ్ల వరకు నోరూరించే రుచులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఒక ప్రాంత సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించడంలో పాకశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ధనియా పంజిరి
ధనియా పంజిరి పండుగప్పుడు నైవేద్యంగా తరుచూ పెట్టే తీపి వంటకం. ఈ ప్రసి ద్ధమైన ప్రసాదం నార్త్ సైడ్ ఎక్కువగా వాడతారు. ఈ ప్రత్యేక ప్రసాదం రుచికరమే కాదు, పోషకాలతో ఆరోగ్యకరమైనది కూడా. ఈ చక్కని వంటకాన్ని తయారుచేయడానికి ధనియాల పొడి, మఖానా, సారపప్పు, చక్కెర పొడి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పులు, నెయ్యిని ఉప యోగిస్తారు.
ఈ ఏడాది ఎక్కువగా గుగుల్‌లో సర్చ్ చేసిన వంటకాల్లో ఇది ఒకటి. దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం.. ఒక పెనంలో నెయ్యి వేసి తామరగింజలు, మఖానాలని గోధుమరంగులోకి మారేదాకా వేయించాలి. ఇంకో గిన్నెలోకి తీసిపెట్టుకుని.. అదే పెనంలో కొబ్బరి తురుము దోరగా వేయించుకోవాలి.
అలాగే జీడి పప్పు లు, బాదం పప్పులు, సారపప్పుని తక్కువ మంటలో మొత్తం వేగి, కరకరమనే వరకూ కలుపుతూ ఉండాలి. రెండు చెంచా ల నెయ్యి వేసి దనియాల పొడిని తక్కువ మంటలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత వేయించిన పదార్థాలను కలపాలి.
జీడి పప్పు, యాలకుల పొడి, మఖానా వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ధనియా పంజిరిని చల్లబడనివ్వాలి. ఈ రుచికరమైన తీపి వంటకాన్ని గాలి చొరబడని డబ్బాలో దాచుకోవచ్చు లేదా వెంట నే తినేయొచ్చు.
కరకరలాడే శంకర్పాలి..
శంకర్‌పాలి లేదా శక్కర్‌పరా అని కూడా పిలు స్తారు. దీన్ని చక్కెర, నెయ్యి, మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్రసిద్ధి చెందిన భారతీయ తీపి వంటకం. శంకర్పాలి అనే పేరు పర్షియన్ పదం ‘షేకర్‌పరే’ నుంచి వచ్చింది. దీన్ని మురళి, ఖుర్మా, లక్డీ మిథై లేదా మిథై అని కూడా అంటారు. దీన్ని చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.
ఒక పాత్రలో గ్లాసు నీటిని తీసుకుని దాంట్లో చక్కెరను కరిగించుకోవాలి. ఇది బాగా కరిగాక దాంట్లో నెయ్యిని, యాలకుల పొడి, మైదా పిండి, బేకింగ్ సోడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన సైజ్‌లో కట్ చేసుకుని.. నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.
చామంతి పొడి..
ఇది కేరళకు చెందిన పొడి మసాలా చట్నీ. ఈ చట్నీ పాడవ్వదు. ముందుగా స్టౌపై పాన్ పెట్టి.. దాంట్లో రెండు చెంచాల నూనె వేసి.. వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఇందులో నువ్వులు, చింతపండు కూడా వేయాలి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పప్పులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆతర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చివరగా పోప్ దిను సులతో తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ రుచి కమ్మగా ఉంటుంది.
చరణామృతం..
సనాతన ధర్మంలో పూజకు, ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. పూజ సమయంలో వినియోగించే ద్రవ్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పూజ సమయంలో, ఆలయాల్లో లేదా శుభకార్యాల్లో దేవుళ్లకు అభిషేకాలు నిర్వహిస్తున్న సమయంలో పంచామృతాలు ఉపయోగిస్తారు. పూజలో వినియోగించే అనంతరం ప్రసాదంగా తీసుకునే చరణామృతం పూజలో విశిష్ట స్థానం ఉంది.
భక్తులకు పూజారులు ప్రసాదంగా ఇస్తుంటారు. చరణామృతం అనేది తీపి పాయసం. దీన్ని పెరుగు, పాలు, చక్కెర, తేనె, నెయ్యి, బాదం, జీడిపప్పు, మఖానాతో తయారు చేస్తారు. దీన్ని సేవించడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, సానుకూల ఆలోచనలు వస్తాయని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలామంది నమ్మకం.
ఉగాది పచ్చడి..
ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే.. వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్దంగా ఉగాది పచ్చడిని చేసుకుంటారు. ఉగాది పచ్చడి అనేది ఆరు విభిన్న రుచులను కలిగి ఉంటుంది. ఇది సంప్రదాయక వంటకం.
దీంట్లో వేప పువ్వులు, పచ్చి మామిడికాయ తురుము, బెల్లం, మిరియాల పొడి, కొబ్బరి, ఉప్పు కలిపిన తియ్యటి, పుల్లటి స్వీట్ ఐటమ్. ఉగాది పచ్చడి కోసం మామిడికాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం చెంచా కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు.