calender_icon.png 17 October, 2024 | 2:03 PM

మా మద్దతు మీకే..

17-10-2024 01:32:23 AM

  1. అమెరికా ఎన్నికలను హీటెక్కిస్తున్న సెలబ్రిటీలు
  2. ట్రంప్, కమలకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్న వైనం

వాషింగ్టన్ డీసీ, అక్టోబర్ 16: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్క డి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ప్రెసిడెన్షియల్ రేసులో ఉన్న అభ్యర్థులకు సెలబ్రిటీలు బహిరంగాంగానే తమ మద్దతు తెలుపుతుండటం చర్చనీయాంశంగా మారి ంది.

డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (59)కి మద్దతుగా ఇప్పటికే పలువు రు సెలబ్రిటీలు పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. మరికొందరు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్(78)కి మద్దతుగా ర్యాలీల్లో పాల్గొంటున్నారు.

హారిస్‌కు మద్దతు తెలిపిన సెలెబ్రిటీలు

1. ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హాత్యే ఇటీవల ఓ ర్యాలీలో పాల్గొని ‘సమ్ బడీ టు లవ్’ అనే ప్లకార్డును ప్రదర్శించి కమలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఓ టీవీ షోలో ఆమె మాట్లాడుతూ.. కమలా హారిస్‌కు ఓ వేయడం తన కుమార్తె భవిష్యత్‌కు పెట్టుబడి అని స్పష్టం చేశారు. 

2. నీల్‌యంగ్ (కెనెడియన్‌ అమెరికన్ సింగర్): హారిస్ నిజాయితీ, సూటిగా నిజం చెప్పేవారు అని నీల్‌యంగ్ ప్రశంసించాడు.

3. ఒలివియో రోడ్రిగో (అమెరికన్ గాయని, నటి): అబార్షన్ నిషేధాలను ఆపివేస్తారని హారిస్ వాగ్దానం చేయడం నాకు నచ్చింది.

4.స్పైక్ లీ (దర్శకుడు), 5. కెన్ బర్న్స్ (దర్శకుడు), 6. ఆరోన్ సోర్కిస్ (స్క్రీన్ రైటర్), 7. రోసీ ఓడొనెల్, జామీ లీ కర్టిస్( నటీమణులు), 8.రాబర్ట్ నీరో, చార్లీ ఎక్స్‌సిఎక్స్ తదితరులు హారిస్‌కు మద్దతు తెలిపారు. 

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, జిమ్మీ కార్టర్ తదితరులు ఇప్పటికే హారిస్‌కు ఓటువేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. 

ట్రంప్‌కు మద్దతు తెలిపిన ప్రముఖులు

మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపతున్నారు.

1. డెన్నిస్ క్వాయిడ్ (నటుడు): ఒక ర్యాలీలో ట్రంప్‌ను ‘21వ శతాబ్దపు తన అభిమాన అధ్యక్షుడి’గా వర్ణంచాడు.

2. హల్క్ హెగన్ (మాజీ రెజ్లర్): ట్రంప్ ఈజ్ మై హీరో.

3. కిడ్ రాక్( సంగీతకారుడు): ‘అమెరికన్ బాడ్ యాస్’ అనే పాట ద్వారా ట్రంప్‌కు తన మద్దతు తెలిపాడు.

4. ఎలన్ మస్క్( ఎక్స్ అధినేత, బిలియనీర్): ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ ఇప్పటికే ట్రంప్‌కు మద్దతు తెలపడంతో పాటు రిపబ్లికన్ పార్టీకి భారీ ఎత్తున విరాళం అందించాడు.

మరికొంతమంది ప్రముఖలు: డానా వైట్, అంబర్ రోజ్, క్రిస్ జాన్సన్, జాసన్ ఆల్డియన్, స్టీవ్ వైన్, రోసన్నే బార్ తదితరులు ట్రంప్‌కు తమ మద్దతు తెలిపారు.