calender_icon.png 16 March, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా మద్దతు మీకే.. దోచుకున్న వాళ్లకివ్వం

16-03-2025 12:48:07 AM

  • చార్మినార్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి
  • ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ 

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచు కున్న వారికి కాకుండా.. అభివృద్ధి పథంలో నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచు కున్న వారిని తిరిగి అధికారంలోకి రానీయబోమని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చార్మినార్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

కొన్నేళ్లుగా చార్మినార్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయిని అరికట్టాలని, బస్తీల్లో అవుట్ పోస్టు లను ఏర్పాటు చేయాలన్నారు. యంగ్ ఇం డియా రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రస్తు తం ఉన్న విద్యాసంస్థల్లోని ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాన్సర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరా రు. సాలార్‌జంగ్, నయాపూల్, పురాణాపూ ల్ ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని, మ హవీర్ జయంతి రోజు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని, లాల్ దర్వాజ ఆలయ అభి వృద్ధికి నిధులివ్వాలని సీఎంను కోరారు.