13-03-2025 01:07:58 AM
కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కా నుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమం లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..- “మొదట్లో ‘దిల్ రూబా’ను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడిన మాట నిజం.
అయితే ఇప్పు డు మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ నెల 14న కాదు 13 సాయంత్రమే ‘దిల్ రూబా’ ప్రీమియ ర్స్‌తో మా సక్సెస్ జర్నీ స్టార్ట్ కాబోతోంది. హోలీ పండుగను మా మూవీతో కలిసి థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకోండి. ఫ్యామిలీస్ ఇబ్బందిపడే ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా సినిమాలో ఉండదు. ఇంత క్లీన్‌గా కమర్షియల్ సినిమా తీయగల రా అని ‘దిల్ రూబా’ చూశాక మీరే అంటారు.
సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేను కానీ మీ టైమ్‌ను వృథా చేయను, మీకు ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని మాత్రం ఇవ్వగలను” అన్నారు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ..- “దిల్ రూబా’ సినిమాలో అంజలి క్యారెక్టర్‌లో నటించాను. అంజ లి క్యారెక్టర్ ఎనర్జిటిక్‌గా ఉంటూనే ఎంతో ఎమోషనల్ డ్రైవ్ తో సాగుతుంది” అని తెలిపింది. ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ.. ‘దిల్‌రూబా’ సినిమా విజయంపై మేమంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం.
ఈ చిత్రంలో కిరణ్ గారు చేసిన ఫైట్స్, డ్యాన్సులు విజిల్స్ వేయిస్తాయి” అన్నారు. ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. “దిల్‌రూ బా’ విషయంలో కిరణ్ గారు మా కంటే ఎక్కువగా కథను, దర్శకుడినీ నమ్మారు. కథను, డైరెక్టర్‌ను నమ్మిన ప్రతి హీరోకు సక్సెస్ తప్పకుండా వస్తుంది” అన్నారు.
డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ.. “కిరణ్ గారు ఈ సినిమాలో చేసిన ఫైట్స్, చెప్పే డైలాగ్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఆయన కోసం నేను ఇంకా మంచి డైలాగ్స్ రాసేందుకు రెడీ. రీసెంట్ గా ‘దిల్ రూబా’ సినిమా చూసి కిరణ్ గారు టెన్షన్ పడకు సినిమా అదిరిపోయింది అన్నారు. ఒక కొత్త కిరణ్ అబ్బవరంను స్క్రీన్ మీద చూస్తారు” అన్నారు. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సినిమా టీంతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు.