calender_icon.png 19 April, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేశారు

17-04-2025 12:41:40 AM

అసంపూర్తి నిర్మాణాలు..     

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా

 కొండపాక,ఏప్రిల్ 16: శుభకార్యాలకు పల్లె ప్రజలకు ఫంక్షన్ హాల్స్ నిర్మించాలనే లక్ష్యం నిధుల లేమితో నిరుపయోగంగా మా రాయి. అసంపూర్తి నిర్మాణాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుగా మారుతున్నా యి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఫంక్షన్ హాల్ ని ర్మించాలనే సూచనతో అధికారులు అందు కు మంజూరు చేశారు. మొదటి దశలో నిధులు విడుదల చేయగా నిర్మాణాలు ప్రా రంభం చేశారు. ఉమ్మడి కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి, దర్గా, సిరసనగండ్ల, మర్పడగా, దమ్మక్కపల్లి, తిమ్మారెడ్డిపల్లి, వెలికట్ట, జప్తి నాచారం, లకుడారం, మెదిని పూ ర్, కొండపాక, కుక్కునూరు పల్లి గ్రామాలలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షల చొప్పున నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో మర్పడగా, కుక్కునూరు పల్లి, ద ర్గా, అంకిరెడ్డిపల్లి, మెదినిపూర్, కొండపాక గ్రామాలలో మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయినప్పటికీ నిరుపయోగంగానే ఉన్నా యి. మిగితా  గ్రామాలలో ఫంక్షన్ హాల్ నిర్మాణాలు వివిధ కారణాలతో మధ్యలోనే నిలిచిపోయాయి. పూర్తి అయిన వాటిలో మర్పడగ, దర్గా గ్రామాలలో మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగతావన్నీ నిరుప యోగంగానే ఉన్నాయి.

అసంపూర్తిగానే ఉన్న డైనింగ్ హాల్ నిర్మాణాలు

 ఫంక్షన్ హాల్ ఉన్నచోట డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ. 75 లక్షల నిధులు మంజూ రు చేశారు. వీటిలో పలు గ్రామాలలో పను లు ప్రారంభించారు. కానీ అసంపూర్తిగానే వదిలేశారు. డైనింగ్ హాల్ లేని కారణంగా కొన్ని గ్రామాలలో ఫంక్షన్ హాల్ లు ఉపయోగించుకోవడం లేదు. మరికొన్ని గ్రామా లలో ఊరు చివర వసతులు లేని చోట నిర్మించడంతో వాటిని కూడా ఉపయోగించుకోవడం లేదు. నిరుపయోగంగానే మిగి లాయి. వాటిని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇంకా పనులు పూర్తికానిచోట పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా

 గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఫంక్షన్ హాలులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయని. అసంపూర్తిగా వదిలేయడంతో నిరుపయోగంగా మారి మద్యం తాగడానికి, ఊరుకు చివరగా ఉండటంతో మందుబాబులకు ఆడింది ఆటలా ఉన్నాయి. అక్కడ ఖాళీ మందు బాటిళ్లు, ఖాళీ గ్లాసులు చెత్తాచెదారంతో నిండిన పరిస్థితులు దర్శనమిస్తున్నా యి. వెలికట్ట, అంకిరెడ్డిపల్లి, కొండపాక తదితర గ్రామాల్లోని ఫంక్షన్ హాల్ లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ప్రజలు అంటున్నారు.