- బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలతో ఆందోళన చెందొద్దు
- మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, రైతుభరోసాపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుం దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.లక్ష మాఫీ చేయడానికి అయిదేండ్లు తీసుకొని, కేవలం సగం మందికీ డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని, ఆ విషయం ప్రస్తావించే ధైర్యం లేక, మా ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ, రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నారన్నారు.
తెల ంగాణతో పాటు రైతులకు ద్రోహం చేసింది ఎవరో, రుణమాఫీ పేరుతో వంచన చేసిం దెవరో, ఏ ఊరుకైనా, ఏ గడపకైనా వెళ్లి అడిగినా తెలుస్తుందన్నారు. రైతులను విస్మరించినందుకే గడిచి న ఎన్నికల్లో కర్రుకాల్చి వాతలు పెట్టారన్నారు. అయినా బీఆర్‌ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. 2018లో రుణమాఫీ అమలుకు కూడా కుటుంబాన్నే యూనిట్‌గా పరిగణించారని, కుటుంబ నిర్ధారణకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకున్నామని చెబు తున్నా.. రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారన్నారు. 20.84లక్షల మందికి రుణ మాఫీ ఎగ్గొట్టింది నిజం కాదా అని నిలదీశారు.