నాగారం (విజయకాంతి): వివిధ రకాల నిర్మాణాలకు ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం పథకం ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకొని, ఇసుకను పొందాలని తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు తెలిపారు. https://tgmiv.cgg.gov.in/home;jsessionid=277DF3B6E2BCC883FE3DB259FC4AE4F0 లింక్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మన ఇసుక వాహనం సౌకర్యాన్ని జాజిరెడ్డి గూడెం, నాగారం, తుంగతుర్తి, సూర్యాపేట మండలాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దీని ద్వారా ఒక ట్రాక్టర్ ఇసుకకు 1 నుండి 10 కి.మీ. వరకు రూ.2319, 11 నుండి 15 కి.మీ. వరకు రూ.2444, 16 నుండి 20 కి.మీ. వరకు రూ.2819, 21 నుండి 25 కి.మీ. వరకు రూ.3194 ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. ఇందులో ట్రాక్టర్ యజమానులకు రూ.1000, లేబర్ కు రూ.500, గ్రామ పంచాయతీకి రూ.100 చెల్లిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని 4 మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.