calender_icon.png 25 December, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా రూటే సపరేటు

02-11-2024 01:17:46 AM

  1. జిల్లా విద్యాశాఖ పరిధిలో అనధికార డిప్యుటేషన్లు
  2. నచ్చిన వారికి కాంట్రాక్ట్ కొలువులు ఇచ్చే ప్రయత్నాలు
  3. ‘గ్లోబల్ ఫౌండేషన్’ అనుమతులు సైతం ‘మామూలే..’
  4. సేవ చేస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి వసూళ్లు

సూర్యాపేట, నవంబర్ 1 (విజయక్రాం తి): సూర్యాపేట జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం నచ్చిన వారికి అక్రమంగా కొలువులు కట్టబెట్టే యంత్రాంగంగా మారిందనే ఆరోపణలు జిల్లాలో గుప్పుమంటున్నా యి. అక్రమ డిప్యూటేషన్లు, కొందరికి కాం ట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్.. ఇలా చెప్పుకొం టూ పోతే పెద్ద చిట్టానే ఉందని ఆ శాఖ వర్గా లు పేర్కొంటున్నాయి.

జిల్లా విద్యాశాఖలో కొందరు అక్రమంగా కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కొద్దిరోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. అలాగే గతంలో పెండెం జ్యోతి అనే మహిళ  అప్పటి ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో పాలకీడు మండలం ఎంఈవో కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో కొలువు సాధించింది.

ప్రతి నెలా ఆమెకు రూ.5 వేల చొప్పున మేనేజ్‌మెంట్ నిధుల నుంచి వేతనం అందే ది. ఆరు నెలలు పని చేసిన తరువాత ఆమె వేతనం సరిపోవడం లేదని ఆ ఉద్యోగం మానివేసినట్లు సమాచారం. ఇటీవల ఆ మహిళకు సమగ్రశిక్ష అభియాన్ నుంచి పే రోల్ ఐడీ ( 71114990) సృష్టించి కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తించి, పే రోల్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు లేఖ వెళ్లింది.

కార్యాలయంలో ఒకరికి కాంట్రాక్ట్ కొలువు ఇవ్వాలంటే ముందు గా నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేదా సంబంధితశాఖ నుంచి సరైన అనుమతులు  ఉండాలి. కానీ, ఆ నియమాలేవీ డీఈవో కార్యాలయంలో పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే కాకుండా జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కాంటెజెన్సీ వర్కర్‌గా విధులు నిర్వహి స్తున్న ఓ మహిళకు కార్యాలయంలో  కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్ కొలువు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.

తిరుమలగిరి కాస్తూర్బా విద్యాల యంలోనూ కాంట్రాక్టు పద్ధతిలో ఓ మహిళను నియమించేందుకు యత్నించి ఓ అధికారి విఫలమయ్యాడని తెలిసింది. దీని వెనుక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడని, అతని కనుసన్నల్లోనే జిల్లాస్థాయి అధికారి నడచుకుంటున్నారని, ఆ శాఖ సిబ్బందే చర్చించుకుంటున్నారు.

ఫౌండేషన్ అనుమతుల వెనుక ఏం జరిగిందంటే..

గ్లోబల్ ఫౌండేషన్ అనే సంస్థ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొన్ని సేవలు ఉచితంగా అందిస్తామని, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ద్వారా తీసుకున్న ఉత్తర్వులను జత చేసి గత నెలలో జిల్లా విద్యాశాఖ అధికారులకు లేఖ పెట్టుకున్నది. అయితే ఈ సంస్థలో పని చేసే వ్యక్తిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఇవేమీ పట్టించుకోకుండా సదరు సంస్థకు విద్యాశాఖ అధికారులు అనుమతులు జారీ చేశారు. అందుకు భారీ మొత్తంలో వారికి మూమూళ్లు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సదరు సంస్థ అంతకుముందే ఎంపిక చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు అనుమతించడం లేదని తెలు స్తోంది.

సంస్థ పేరుతో వసూళ్లు జరుగతున్నది నిజమేనని, ఒక్కో వ్యక్తి నుంచి సంస్థ రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలనే డిమాండ్ జిల్లావాసుల నుంచి వ్యక్తమవుతున్నది.

అన్ని ఓరల్ డిప్యుటేషన్లే..

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అక్రమ డిప్యుటేషన్ల పర్వం నడుస్తున్నది. ఇక్కడ అన్నీ ఓరల్ డిప్యూటేష న్లేనని, ఏ ఒక్క డిప్యూటేషన్‌కూ సరైన ఉత్తర్వు లేదని తెలుస్తోంది. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించాల్సిన సైదారాజు ప్రస్తుతం కోదాడ ఎంఈవో ఆఫీస్, కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించాల్సిన  మదనాచారి మెళ్లచెర్వుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు.

మూడేళ్ల క్రితం అధికారిక ఉత్తర్వులు లేకుండానే వీరిని డిప్యూటేషన్‌లో పంపించారని, వారు అక్కడ కూడా విధులకు హాజరుకావడం లేదని సమాచారం. అయినా వారు ప్రతి నెలా వేతనం తీసుకుంటున్నట్లు తెలిసింది. అదే విధంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఇక్కడే పని చేస్తున్నది.

ఇటీవల ఆమె నల్లగొండకు బదిలీ అయినా, ఆమె అక్కడికి వెళ్లకుండా డిప్యుటేషన్ పేరుతో సూర్యాపేటలోనే విధులు నిర్వహిస్తున్నది. ఈమెకు డిప్యూటేషన్ ఇచ్చినట్లు ఎలాంటి ఆర్డర్స్ కూడా లేవని కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

అలాగే సూర్యాపేట ఎంఈవో  కార్యాలయ పరిధిలో పనిచేయాల్సిన కంప్యూటర్ ఆపరేటర్ మనోహర్ పదేళ్ల పాటు ఓ ప్రజాప్రతినిధి వెంట ఉంటూ కాలం వెళ్లదీశాడు. ఇప్పుడాయన ఎక్కడ విధులు నిర్వహిస్తున్నాడో ఆ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. కానీ, సదరు ఆపరేటర్ నెల నెలా వేతనం మాత్రం తీసుకుంటున్నట్లు సమాచారం. అందు కు ఆ ఆపరేటర్ ఉన్నతాధికారులకు మామూళ్లు ఇస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

ముందుగా ఇస్తే తప్పేంటి..?

పాలకీడు మండలంలో 2020లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన పెండెం జ్యోతి కొన్ని రోజులు ఉద్యోగం చేసి మానివేసింది. తన ఉద్యోగం తనకు కావాలని కోరడంతో సమగ్ర శిక్ష అభియాన్ నుంచి పే రోల్ ఐడీ క్రియెట్ చేసి అనుమతుల కోసం స్కూల్ ఎడ్యూకేషన్  డైరెక్టర్‌కు పంపాం. ముందుగా పే రోల్ ఐడీ ఇస్తే తప్పేముంది? మేం కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వకూడదా..?

 అశోక్, 

జిల్లా విద్యాశాఖఅధికారి,

సూర్యాపేట