17-04-2025 12:32:07 AM
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి
ఖమ్మం, ఏప్రిల్ 16 (విజయక్రాంతి ):- మన మూలాలు జానపదంలోనే ఉన్నాయ ని, సాహిత్య అధ్యయనం, పరిశోధకుల వలన మానవ జీవితంలోని అనేక జీవనాంశాలు అర్థం చేసుకోవచ్చని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజుబాలాచారి అన్నారు.
బుధవారం జానపద సాహిత్య, విజ్ఞాన పరిశోధక బ్రహ్మ ఆచార్య బిరుదురాజు శతజయంతి ప్రారంభ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజ న్యంతో,ఖమ్మం ఎస్.ఆర్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల తెలుగు విభాగం నిర్వహించిన బిరుదు రాజు రామరాజు శతజయంతి సమాలోచన సదస్సును ప్రారంభం చేస్తూ ఆయన మా ట్లాడారు.
జానపదపరిశోధన చేసిన మొట్టమొదటి పరిశోధకుడు బిరుదురాజు తెలుగు సాహిత్య లో విభిన్నమైన సాహిత్య కా రుడిగా నిలిచారని తెలిపారు. విద్యార్థులు ముందు తరాల సాహిత్యాన్ని పఠనం, పరిశోధనలదిశగా ఆలోచన చేయాలని సూచిం చారు. ఖమ్మం కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీ బాటలో ఈ సదస్సు ను నిర్వహించడంఅభినందనీయమన్నారు.
విశ్రాంత ఆచార్యులు డా.గన్నమరాజు మనోహర్ బాబు బిరుదురాజు సాహితీ మూర్తిమత్వం పై కీలకోప న్యాసం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ ఖమ్మం కళాశాల, విద్యార్థుల కోసం విభిన్న జిజ్ఞాసాత్మకమైన సదస్సులు నిర్వహించడం లో సంస్కారవంతమైన కళాశాల గానిలిచిందన్నారు.
కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి అధ్యక్షత వహించారు.స దస్సు ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని తెలుగు విభాగాధిపతి డా.పి.రవికుమార్ తెలిపారు.కార్యక్ర మంలో గౌరవ అతిథులుగా వైస్ ప్రిన్సిపాల్ డా.బానోత్ రెడ్డి, కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు రవిమారుత్, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రసేన్, ఐ.క్యూ.ఏ .సి కోఆర్డినేటర్ డా.ఎం.సునంద,కవి యాకూబ్, సమతా శ్రీధర్ పాల్గొన్నారు.
సీనియర్ అధ్యాపకులు డా.సీతారాం, కె.యు.తెలుగు బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ డా.మంథని శంకర్, సదస్సు కోకన్వీనర్ డా.జె.అనురాధ, కపిల భారతి,వాహెద్, కిరణ్,కోటమ్మ, ఎం.వి. రమణ, కార్తీక్,వై.శ్రీనివాస్.పత్రసమర్పణలు చేశారు.యూ.జి.,పీ,జి తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు.