29-03-2025 12:38:45 AM
హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “మా రాబిన్‌హుడ్ సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. నితిన్ పెర్ఫార్మెన్స్‌తోపాటు వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్‌ని ప్రేక్షకులు హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. క్లుమైక్స్‌లో వచ్చే ఎమోషన్, ట్విస్టుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మేం సందర్శించిన రెండు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూస్తున్నప్పుడు చాలా ఆనందమేసింది.
వార్నర్ క్యామియోకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది. ఇది ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా. ఈ ఉగాదికి చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది’ అన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ఇది ఆడిటోరియంలో సూపర్ హిట్ సినిమా. ఇందులో మంచి కథతోపాటు బ్యూటిఫుల్ సాంగ్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైట్స్.. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఈ సినిమా సమ్మర్‌కు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైననర్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాం. ప్రతి షోకీ కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. గ్రాడ్యుల్‌గా ఈ సినిమా పెరుగుతూ వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేసి చాలా బాగుందని చెప్పారు. ప్రతి షోకూ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సినిమా కచ్చితంగా విన్నర్ అవుతుందని నమ్ముతున్నాం’ ని చెప్పారు.