01-04-2025 01:02:01 AM
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి ప్రారంభమైం ది. మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీ యూ 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. మొదటి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఏపీలోని కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం తీసుకెళ్తున్న నౌకను జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇతర దే శాలకు కూడా బి య్యం ఎగుమతి చే సేందుకు తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జ రుపుతున్నదని పేర్కొన్నారు.
ఈ ఏ డాదిలో తెలంగాణలో 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ నుంచి సీఎంఆర్ ధరను స్వీకరించడంలో జాప్యం చేయడం వల్ల వడ్డీ చెల్లింపులపై ఆర్థిక ఎదుర్కొంటున్నామని తెలి పారు. ఫిలిప్పీన్స్‌కు పంపించే బి య్యం విషయంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు.