12-03-2025 09:52:21 AM
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఉపాధి(employment ) కల్పించడం మా బాధ్యతని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. మంథని మండలంలోని సూరయ్య పల్లి గ్రామానికి చెందిన పలువురు యువతీ యువకులు ఉన్నత విద్యను అభ్యసించి అనేక సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ నియామకాలు, ఉపాధి లేకుండా ఖాళీగా ఉంటున్నారని వారికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు మంథని సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్ హైదరాబాద్ లోని సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు త్వరలోనే వీరందరికీ శిక్షణ ఇచ్చి ఖాళీగా ఉన్న ప్రాంతాలలో నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారని కిరణ్ గౌడ్ తెలిపారు. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.