మంత్రి శ్రీధర్‌బాబుకు ఆర్టీసీ యూనియన్ వినతి
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాం తి) : గురువారం నుంచి నిర్వహించే ఏడాది పాలన విజయోత్సవాల్లో తాము పాల్గొనాలంటే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యద ర్శి కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రిని శ్రీధర్‌బాబును కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ట్రేడ్ యూనియన్ గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.