calender_icon.png 7 February, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు మాదిగ జాతి రుణపడి ఉంటుంది

07-02-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 6: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేసిన సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందని మాదిగ హక్కుల దండోరా (హెచ్‌ఎండీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, గౌరవాధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..

మాల, మాదిగలను శత్రువులుగా మార్చాలని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు దళితులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. రిజర్వేషన్‌లు పంచుకునే కార్యక్రమం ముగిసిందని, ఇక రిజర్వేషన్‌లు పెంచుకునే కార్యక్రమానికి మాల మాదిగ ఇతర ఎస్సీ ఉపకులాలు సిద్ధం కావాలని అన్నారు. ఈ సమావేశంలో మాదిగ నాయకులు మైసయ్య, అందెల భవాణీరెడ్డి, రోజారాణి, వీరస్వామి,  అశోక్ వర్ధన్, రామన్, చందు పాల్గొన్నారు.