calender_icon.png 6 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుంది

06-02-2025 01:30:14 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 5: మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందని మాదిగ సంఘాల ఫ్రంట్ (ఎంఎస్‌ఎఫ్) పేర్కొంది.

బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు జన్ను కనకరాజు మాదిగ, తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్ మాట్లాడారు.

తెలంగాణలో ఎస్సీల జనాభా 17.43 శాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీల రిజర్వేషన్‌లు 17 శాతానికి పెంచి, అందులో మాదిగల జనాభాకు తగినట్లుగా 10 శాతం కల్పించాలని కోరారు. 

సంబురాలు.. నిరసనలు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎస్సీ రిజరేషన్ వర్గీకరణ అంశంపై ఓవైపు ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం సంబురాలతోపాటు నిరసనలు చేపట్టారు. ఆదిలాబాద్ అంబేద్కర్ చౌక్‌లో ఎమ్మార్పీఎస్ ఆధర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు మాదిగ,

ఉపకులాల ప్రజలు పాలాభిషేకం చేశారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలు బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం ఫ్లెక్సీని దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో మాలలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.