‘మన సినిమా.. ఫస్ట్ రీల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోని బోయి విజయ భారతి వేదికపై జరిగింది. ప్రముఖ జర్నలిస్టు రచయిత డాక్టర్ రెంటాల జయదేవ రాసిన ఈ పుస్తకాన్ని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణ కౌండిన్య, ఎమెస్కో విజయ్‌కుమార్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ చంద్రశేఖర్‌రెడ్డి, కవి అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకుడు దశరథ్, సీనియర్ జర్నలిస్ట్ ఇందిరా పరిమి తదితరులు పాల్గొన్నారు.