calender_icon.png 20 January, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ లెక్చరర్లు కీలకపాత్ర పోషించాలి

20-01-2025 12:00:00 AM

ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19(విజయక్రాంతి): గుండెల్లో దాచుకున్న మాదిగ ల గోసను ‘లక్ష డప్పులు వేల గొంతుల’తో వినిపించాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు. ఉస్మానియా యూని వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఈసీఈ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన మాదిగ లెక్చరర్స్ రాష్ట్రస్థాయి సమావేశానికి మందకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. ఈ అంతిమ పోరాటం లో మాదిగ లెక్చరర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. మాదిగ లెక్చరర్స్ రాష్ట్ర కన్వీనర్ జిల్లా నర్సింహ, ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటేశ్వర్లు, నాయకులు నర్సయ్య, జాన్‌విల్సన్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.