* సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్
కామారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఆదివారం ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీలోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వేడుకున్నారు. ఇచ్చిన హమీలను నేరవేర్చి తమ కుటుంబాలను అదుకోవాలని కోరారు. సీఎంతో పాటు మంత్రులను కలిసి సమస్యలను విన్నవించినట్లు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు.