శ్రీసింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మత్తువదలరా2’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తాము అనుకున్నదాని కంటే రెట్టింపుగా స్పందన వస్తుండటం ఆనందంగా ఉందని చెప్తున్నారు డైరెక్టర్ రితేశ్ రానా. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. “మత్తువదలరా’ -సీక్వెల్ చేయాలని చెర్రీగా ఎప్పటినుంచో అన్నారు.
అయితే ఆర్గానిక్‌గా ఓ మంచి ఐడియా వస్తేనే చేయాలి. అలాంటి ఐడియా క్రాక్ చేసి చెర్రీకి, టీమ్‌కి చెప్పా. అందరికీ నచ్చింది. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో -స్లేవ్ డ్రగ్‌ని ఒక మెటాఫర్‌లా వాడాం. మత్తు అనేది కేవలం నార్కోటిక్స్నే కాదు. మత్తు చాలా రకాలుగా ఉంది. మత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం. పార్ట్ 3 కోసం -ఐడియాస్, ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. వాటిని ఇంకా డెవలప్ చేయాలి. ఇంకో సినిమా చేసిన తర్వాత పార్ట్ 3 ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా చెర్రీతోనే చేస్తా.