టాప్ 100లో చోటు సంపాదించిన భారత్‌కు చెందిన ఐదు బ్రాండ్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: సాంప్రదాయ వంటకాలకు ఫేమస్ అయిన భారతదేశం తాజాగా విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే డిజర్ట్స్‌లోనూ తనదైన ముద్ర వేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచంలోని 100 బెస్ట్ ఐస్‌క్రీమ్‌లలో భారతదేశానికి చెందిన 5 ఐస్‌క్రీమ్ బ్రాండ్లు చోటు సంపాదించాయి. అందులో 1. ముంబైకి చెందిన ‘రుస్త్తుమ్ అండ్ కో’ కి చెందిన మ్యాంగో ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్, 2. బెంగళూరుకు చెందిన ‘కార్నర్ హౌస్’ సంస్థ తయారు చేసే ‘డెత్ బై చాక్లెట్’, 3. నేచురల్ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కు చెందిన ‘టెండర్ కొకోనాట్’, 4. అప్సర బ్రాండ్‌కు చెందిన ‘జామ ఐస్‌క్రీమ్’, 5. మంగళూరుకు చెందిన ‘పబ్బాస్ గద్భద్ ఐస్‌క్రీమ్’ చోటు సంపాదించాయి.