calender_icon.png 21 October, 2024 | 1:25 PM

మన వారసత్వ సంపద!

21-10-2024 12:00:00 AM

గేట్ వే ఆఫ్ ఇండియా.. ఇది అరేబి యా సముద్రం ఒడ్డున ముంబై నౌకాశ్రయానికి ఎదురుగా ఉన్న ఒక గంభీరమైన తోరణం. ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 1911వ సం వత్సరం డిసెంబర్‌లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ క్వీన్ మేరీలు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు గుర్తుగా గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. ఇది హిందూ, ఇస్లామి క్, యూరోపియన్ నిర్మాణ శైలిని పోలి ఉం టుంది.

ముంబై నగరంలో అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. ఎనిమిది అంతస్తుల ఎత్తులో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కట్టడం శిల్ప కళా నైపుణ్యం అద్భుతం. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్ష లు ఖర్చు అయింది. బ్రిటీష్ సైన్యం భారత్ నుంచి వెనుదిరిగినప్పుడు అందులోని సోమర్ సైట్ లైట్ ఇన్ ప్రాంటీ మొదటి దళం గేట్ వే ఆఫ్ ఇండియా నుంచే బయలుదేరి వెళ్లింది. 

ఎలిఫెంటా కేవ్స్..

గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ముంబై హార్బర్‌లోని ఎలిఫెంటా ద్వీపానికి పడవ ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. ఘరాపురి అంటే గుహల నగరం అని అర్థం. ఇక్కడే ఎలిఫెంటా గుహలు ఉన్నాయి. ఈ దీవిని శైవుల ప్రధాన స్థావరంగా చెబుతారు. ప్రపం చ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.  యునెస్కో ప్రపంచ వారసత్వ సంప దగా గుర్తింపు పొందినది. గుహపై భాగంలో విస్తరించిన శివుడికి సంబంధించిన వివిధ ఆకృతుల్లో శిల్పాలు, భంగిమలు కనిపిస్తాయి. 

ఎలా వెళ్లాలంటే?

హైదరాబాద్, బెంగళూరు, గాంధీనగర్ తదితర ప్రాంతాల నుంచి ముంబైకు పలు ప్రభుత్వ లేదా ప్రయివేట్ బస్సులు తిరుగుతుంటాయి.