మాటిచ్చాం మనసుపెట్టి పని చేస్తాం!
- లక్ష కోట్లు ఖర్చు చేసి పాలమూరును అన్నపూర్ణగా మారుస్తాం
విపక్ష పార్టీ నేతల చెంప చెల్లుమనిపించేలా ప్రభుత్వ పథకాల అమలు
రూ. 87.41 కోట్ల నిధులతో 5సబ్ స్టేషన్ల శంకుస్థాపనలు
రూ. 76.95 కోట్ల నిధులతో మార్కండేయ సాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం
మంత్రి జూపల్లితో పాటు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నాగర్ కర్నూల్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
నాగర్‌కర్నూల్, జనవరి 12 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే ఎన్నుకోబడిందని మాట ఇ చ్చి మనసుపెట్టి పనిచేస్తామని మాది మాట ల ప్రభుత్వం అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పాలమూరు ఉమ్మడి జిల్లాను అన్నపూర్ణగా రూపుమాపేందుకు లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ఆదివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో 87.41 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ల శంకుస్థాప నలు,76.95 కోట్ల నిధులతో 7500 ఎకరా లకు సాగునీటిని అందించే మార్కండేయ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ర్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావుతో పాటు పర్యటించారు.
ఈ సందర్భంగా ఆ యా వేదికలపై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సెంటిమెంటుతో అధికారంలోకి వ చ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే పని చేసిందని వేల కోట్లు దోచుకొని తెలంగాణ ప్రాంతాన్ని దివాలా తీసారన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రె స్‌ను నమ్మొద్దని చెప్పుకున్న విపక్ష పార్టీలకు చెంప చెల్లుమనిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే దివాలా తీసిన రాష్ట్రాన్ని సన్మార్గంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మనసుపెట్టి పనిచేస్తూ వారి రుణం తీర్చుకునే విధంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ నె లలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు తో రైతులకు 12 వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని, కౌ లు రైతులను కూడా గుర్తించామన్నారు. దీం తోపాటు డ్రిప్ ఇరిగేషన్, పంట నష్టపరిహా రం తదితర వాటిని అమలు చేసి రైతుల ప క్షాన నిలుస్తామన్నారు.
వ్యవసాయానికి విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో లో వోల్టేజీని అధిగమించేందుకు అవసరమున్న మేరకు విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఐదు సబ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులెవరు దళారులను నమ్మి మోసపోవ ద్దని ట్రాన్స్ఫార్మర్లు అవసరమైతే నేరుగా విద్యుత్ అధికారులను కలవచ్చునన్నారు. ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ ఉపయో గించుకోవాలని సూచించారు.
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాక సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పా టు సోలార్ విద్యుత్ ప్లాంట్లు తదితర పథ కాలతో మహిళా శక్తిగా ఎదిగేందుకు పని కల్పిస్తున్నామన్నారు. ఈనెల 26 నుండి ఇం దిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబో తుందని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరి చేస్తున్నట్లు తెలిపారు.
గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కుర్చేసుకుని కూర్చుని రెండే ళ్లలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా మని చెప్పి 38 వేల కోట్లు ఖర్చు చేసి ఓట్లు రాల్చుకున్నారని ఒక్క మోటర్ నడిపించి మమ అనిపించారని ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చేసి మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.
కష్ణహొ హరివాక పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అచ్చంపేట ఎత్తు ప్రాంతంలోని గ్రామాలకు సైతం సాగు నీటి అందించేలా ఉమామహేశ్వర, చెన్న కేశవ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాట ఇచ్చాము కాబట్టి మనసు పెట్టి పని చేసి పాలమూరు ప్రజల రుణం తీర్చుకుం టామన్నారు.
స్తోమతకు తగిన దావతులే చేసుకోండి: మంత్రి జూపల్లి కష్ణారావు
తెలంగాణ రాష్ర్టం గత పదేళ్ల కాలంలో సాంస్కతి సాంప్రదాయాలు పట్టాలు తప్పిం దని ఒకరిని చూసి మరొకరు స్తోమత లేకున్నా పండగలకు, దావతుల పేరుతో దుబారా ఖర్చు చేసి అనవసరంగా అప్పుల పాలవుతున్నారని రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు నాగర్ కర్నూల్‌లో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు.
ఒకరిని చూసి మరొకరు ప్రభుత్వ పాఠశా లలను కాదని ప్రెస్టేజ్ ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లల్ని పంపుతున్నారని ఆ ప్రైవేటు పాఠశాలలో నిలువు దోపిడీకి గురై అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. వైద్యం విషయంలోనూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అనవసరంగా జేబులకు చిల్లులు పడుతున్నా యని గ్రహించడం లేదన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలోనూ మంచికంటే చెడు అయి తే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తద్వా రా తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలు పూర్తిగా కూని అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి చిన్న దానికి దావతుల పేరుతో దుబారా ఖర్చు చేసుకొని అప్పుల పాలు కావద్దని హితవు పలికారు. చిన్న వయసులోనే యువత చెడు దారిన పయనిస్తూ సమాజానికి తీరని నష్టాన్ని కలిగించే విధంగా మారోద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, వంశీకష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ అలీ, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ విజయభాస్కర్ రెడ్డి, సిఈ బాలస్వా మి, ఎస్‌ఈ పాల్ రాజ్, డిఈఈ శ్రీధర్, ట్రాన్స్కో ఏఈ మాధవి, ఏఈ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.