calender_icon.png 19 November, 2024 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఫోకస్ అంతా ప్రజా సమస్యలపైనే

29-06-2024 01:33:03 AM

  • రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్, జూన్ 28(విజయక్రాంతి): నిరంకుశత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని, అందులో భాగంగానే కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు కల్వకుర్తి ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ బాదావత్ సంతోష్, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ ఎల్లూర్ పంపులను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కల్వకుర్తి ప్రాజెక్టును నిర్మించగా.. రెండు మోటార్లు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నీటిని ఎత్తిపోసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజా అవసరాల కోసమే వాడుకునేందుకు బ్యాలెన్స్ రిజర్వాయర్లను నిర్మిస్తామన్నారు.