20-04-2025 12:00:00 AM
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయరెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయిరాజేశ్ మహదేవ్ తెరకెక్కించారు. ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమయరెడ్డి మాట్లాడుతూ.. “డియర్ ఉమ’ చిత్రానికి వస్తున్న స్పందన చూసి నాకెంతో ఆనందమేస్తోంది.
ఎన్నో సినిమాలు ఇంకా బయటకు రావడంలేదు. కానీ మేం మాత్రం సక్సెస్ ఫుల్‌గా సినిమాను రిలీజ్ చేశాం. అదే నాకు పెద్ద సక్సెస్. రా ష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా. హాస్పిటల్‌లోనే మన జీవితం ప్రారంభమవుతుంది.. అక్కడే ముగుస్తుంది. ఇలాంటి ఓ మంచి సబ్జెక్ట్‌పై తీసిన మా చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా’ అన్నారు.
దర్శకుడు సాయిరాజేశ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం జనం థియేటర్లకు రావడంలేదు. తెలుగు ప్రేక్ష కులు ఎప్పుడూ మంచి సినిమాను ఎంకరేజ్ చేసి సక్సెస్ చేస్తూనే ఉం టారు’ అని చెప్పారు. నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “సుమయరెడ్డి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నా’ అన్నారు.