calender_icon.png 7 February, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా పంట పొలాలు ఎండిపోతున్నాయి

07-02-2025 12:00:00 AM

కొండపోచమ్మ కాలువ ద్వారా చెరువులు నింపాలని రోడ్డుపై ధర్నా చేసిన రైతులు

దౌల్తాబాద్, ఫిబ్రవరి 6: కొండపోచమ్మ కాలువ ద్వారా  చెరువులు నింపకపోవడంతో మా పంట పొలాలు ఎండిపోతున్నాయని ముబారస్ పూర్, మల్లేశం పల్లి, హైమద్ నగర్ గ్రామాల రైతులు గురువారం ఉప్పరపల్లి కెనాల్ వద్ద ధర్నా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ,కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిదానాలు చేస్తూ రైతులు రోడ్డుపై బైటాయించి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగుచేసిన మా పంటలు కళ్ళేదుటే ఎండి పోతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డిలు స్పందించి కొండపోచమ్మ ద్వారా ఉప్పరపల్లి కెనాల్ కాల్వ ద్వారా మాకు చెరువులు నింపాలని కోరారు.

రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ ఎస్త్స్ర శ్రీరామ్ ప్రేమ్ దీప్, ఇరిగేషన్ అధికారులు రైతుల వద్దకు చేరుకొని రెండు, మూడు రోజుల్లో కాలువ ద్వారా చెరువులు నింపి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు భరోసా కల్పించడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో గ్రామాల రైతులు పాల్గొన్నారు.