- వరుసగా విఫలమవుతోన్న రోహిత్, కోహ్లీ
కుర్రాళ్లకు అవకాశమివ్వాలని డిమాండ్
డబ్ల్యూటీసీ 2025 భారత్ షెడ్యూల్ విడుదల
బోర్డర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3 పరాజయం పాలవ్వడంతో టీమిండియా టెస్టు భవితవ్యం అగమ్యగోచరంగా మారిం ది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పూర్తిగా విఫలమైన వేళ రంజీల్లో ఇరగదీస్తున్న కుర్ర క్రికెటర్లకు అవకాశమివ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ మహా అయితే మరో ఏడాది ఆడనున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది సంధి కాలం అయినప్పటికీ జట్టు సమతూకం చాలా ముఖ్యం. దేశవాలీ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగుల చేస్తున్న శ్రేయస్, పటీదార్, రుతురాజ్, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్‌లకు అవకాశమివ్వాలని మాజీ అభిప్రాయపడుతున్నారు.
సొంతగడ్డపై రాణించినప్పటికీ విదేశాల్లో ఆడడం సవాల్‌తో కూడుకున్నది. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్) మన బ్యాటర్లకు కఠిన పరీక్షే. రహానే, పుజారా, కోహ్లీ, రోహిత్ రూపంలో సేనా దేశాల్లో దాదాపు పదేళ్లు మంచి ఆటతీరు కనబరిచారు.
వీరి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కానప్పటికీ కార్యచరణను ఇప్పటి నుంచి సిద్ధం చేసేన్తే రెండేళ్లలో జట్టు బలోపేతమయ్యే చాన్స్ ఉంది. బౌలింగ్‌లో బుమ్రా మినహా మిగతావారి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్, యష్ దయాల్‌ను టెస్టుల్లో అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం గమనార్హం.
రెండేళ్లలో 18 టెస్టులు..
ఆసీస్‌కు సిరీస్ కోల్పోయిన టీమిండియా వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడే అవ కాశాన్ని చేజార్చుకుంది. ఈ ఏడాది జూన్ 11న జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఇక 2025 డబ్ల్యూటీసీకి సంబంధించి భార త్ ఆడే టెస్టు సిరీస్ షెడ్యూల్ బయటకు వచ్చింది. రానున్న రెండేళ్లలో మొత్తం 18 టెస్టులు ఆడనున్న టీమిండియా స్వదేశంలో 9, విదేశీ గడ్డపై తొమ్మిది టెస్టులు ఆడనుంది.
డబ్ల్యూటీసీ 2025 టీమిండియా షెడ్యూల్
- ఇంగ్లండ్ పర్యటనలో 5 టెస్టు మ్యాచ్‌లు (జూన్ 2025)
- వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టు మ్యాచ్‌లు (అక్టోబర్ 2025)
- దక్షిణాఫ్రికా పర్యటనలో 2 టెస్టు మ్యాచ్‌లు (నవంబర్ 2025)
- స్వదేశంలో శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్‌లు (ఆగస్టు 2026)
- స్వదేశంలో న్యూజిలాండ్‌తో 2 టెస్టు మ్యాచ్‌లు (అక్టోబర్ 2026)
- స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్‌లు (జనవరి 2027)