లేదంటే సమ్మెకు దిగుతాం
సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల హెచ్చరిక
కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను ప్రభుత్వం నేరవేర్చాలని సమ గ్ర సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు కోరారు. డిసెంబర్ 3 లోగా తమ డిమాండ్లను ప్రభుత్వం నేరవేర్చకుంటే సమ్మెకు దిగుతామన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నిజాంసాగర్, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, జుక్కల్, కొటగిరి, పిట్లం, మధ్నూర్, బీబీపేట, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, బాన్సువాడ మండల కేంద్రాల్లో శనివారం మధ్యాహ్న భోజన సమ యంలో నిరసన చేపట్టారు.
ఆయా కార్యక్రమాల్లో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్మ్రణ, భాస్కర్‌గౌడ్, జిల్లా ఉపాధ్య క్షుడు జనార్ధన్, మండల సహ అధ్యక్షుడు ఆజయ్, సీఆర్‌టీయు సుధా కర్ రమేష్, కేజీబీవీ స్పెషల్ ఆపీసర్ సవిత, రాణి, రూప, అపర్ణ, పద్మ, స్వర్ణలత, అనుపమ, లావణ్య, శైలజ, మాధవి, కాళీదాస్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.