22-04-2025 01:03:32 AM
ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ డే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ‘కేంద్రంలోని మా ప్రభుత్వం ఆషామాషీ నిర్ణయాలు తీసుకోదు. దేశ ప్రజల వందేళ్ల భవిష్యత్తును అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటాం. సాంకతికత పరుగులు తీస్తున్న ఈ కాలంలో పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు. మున్ముందు రానున్న అవకాశాలను అందిపుచ్చుకొని ప్రజలకు మేలు చేయడం’ అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ డే’లో ఆయన మాట్లాడారు. సర్వతోముఖాభివృద్ధి అంటే దేశంలోని ఒక్క గ్రామమైనా, ఒక్క కుటుంబమైనా, ఒక్క పౌరుడైనా వెనుకబాటులో ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల వెయ్యేళ్ల భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదన్నారు. దేశ యువత, రైతులు, మహిళల ఆకాంక్షలను నెరవేర్చుతూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడతాయన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తే సరిపోదని,ప్ర భుత్వం పని చేయాల్సి ఉంటుందన్నారు. కొ త్త అవకాశాలు సృష్టించడానికి మున్ముందు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ బ్లాక్ ఎంపి కైంది. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీ లో సోమవారం ప్రధాని చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రధాని చేతుల మీదుగా అవార్డును అం దుకున్న సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.